Book Title: Who Am I
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ నేను ఎవరిని ? నీ బాల్యం నుంచి నిన్ను అందరూ 'చందూ' అని పిలుస్తూండటం వల్ల నీవు 'నేను చందూ' అనుకొంటున్నావు. ఈ పేరునే నీవుగా భావిస్తున్నావు. నిజానికి నీవు చందూలాల్ కాదు. నిజానికి నీవెవరివో నీకు తెలియని కారణంగా నీకు పెట్టిన పేరునే నీవని నమ్ముతున్నావు. ఈ నమ్మకం నీ మనస్సు పై శక్తివంతమైన ప్రభావాన్ని చూపెడుతుంది. 'నేను చందూలాల్' అనే తప్పుడు విశ్వాసం నీలో చాలా లోతుగా పాతుకొని పోయింది. ఈ రాంగ్ బిలీఫ్ కారణంగా కళ్ళు తెరచి నిద్రించిన విధంగా నీవు అసంఖ్యాకమైన జన్మలను అనుభవించావు. 'నేను' ను గుర్తించటం దాదా శ్రీ : నీవు నిజంగా ఎవరివి అనే విషయాన్ని నీవు జాగ్రత్తగా విచారించ వలసి ఉన్నదా లేదా? నీ నిజ స్వరూపాన్ని నీవు తెల్సుకోకుండా ఎంతకాలం ఇలా చీకటిలో ఉండగలవు? నిజమైన ఐడెంటిటీని లేదా గుర్తింపుని కని పెట్టక పోవటం అజ్ఞానం అని నీవు తలంచుట లేదా? నిజంగా నీవెవరివో స్వానుభవపూర్వకంగా గుర్తించనంతవరకు నీవు తెల్సుకొన్నవి అన్నీ అసత్యాలు, తప్పులే. నీవు ఈ వాచ్ కొనేముందు దాని తయారీని, విశిష్ఠత, ధర, వారంటీ ఇత్యాదులన్నీ విచారించి తెల్సుకోలేదా? మరి నీగురించి నీవు తెలుసుకోకపోవటం ఎంతవరకు సమంజసం? నీవెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడున్నావు? నీ నిజమైన వ్యక్తిత్వాన్ని గురించిన పరిజ్ఞానం నీకులేదు. వీటిలో దేని గురించీ నీకు తెలియదు. నేనెవరిని? అనే ప్రధాన ప్రశ్నకు సమాధానం తెల్సుకోకుండా ఈ ప్రాపంచిక వ్యవహారాలలో చురుకుగా పాల్గొనటంవల్ల నీ జీవితాన్ని నీవే మరింత జటిలం చేసికొంటావు. ఈ అజ్ఞాన స్థితిలో వివాహం చేసికోవటం, సంసారాన్ని కల్గియుండటం ఇత్యాదుల కారణంగా నీ జీవితాన్ని నీవే మరింత గందరగోళం చేసికొంటావు. ఈ విధంగానే ప్రాపంచికమైన ఎన్నో కఠిన సమస్యలు, భ్రమలు తలెత్తుతాయి. రాత్రి నీవు నిద్రించే సమయంలో కూడా నీవు చందూలాల్ గానే వ్యవహరిస్తావు. ఇదే రాంగ్ బిలీఫ్ రాత్రంతా దానంతట అదే ఇంకా ఇంకా బలపడుంది. ఎవరైనా

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90