Book Title: Adjust Every Where
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ సర్వత్ర సర్దుకొనిపొండి సమస్యాలేదు. కానీ ఈ రోజుల్లో ఈ యిళ్ళు ఉద్యానవనాలయ్యాయి. ఒకే యింట్లో ఒకరు గులాబీ అయితే, మరొకరు మల్లె. గులాబీ మల్లెతో “నీవు నా వలె ఎందుకు లేవు? నీ వెలా తెల్లగా ఉన్నావో చూడు మరి నా మనోహరమైన రంగుని చూడు.” “నీకు అంతా ముళ్ళు ఉన్నాయి” అని మల్లె సమాధానం. గులాబీకి ముళ్లుండటం సహజం. మల్లె అయితే తెల్లగా ఉండటం సహజం. ఈ కలియుగంలో ఒక యింట్లో రకరకాల మొక్కలుంటున్నాయి. అది ఉద్యానవనంలా మారింది. ఎవరూ దీనిని చూడటం లేదు, అందువల్ల అది దు:ఖానికి దారి తీస్తుంది. ప్రపంచానికి ఈ విధమైన దృష్టి లేదు. ఎవరూ చెడ్డవారు కారు. అభిప్రాయ భేదాలకు కారణం అహంకారమే. నాకు అహంకారం లేదు కనుక ప్రపంచంతో నాకు ఘర్షణ లేదు. ఇది గులాబి, ఇది మల్లె, ఇది చంద్రకాంత పుష్పం మరియు ఇది కాకరపువ్వు అని నేను గుర్తించగలను. వీటినన్నిటిని నేను గుర్తించగలను. ఈ ఉద్యానవనాలు అభినందించదగినవి. నీవేమంటావు? ప్రశ్నకర్త : మీరు చెప్పింది నిజమే. దాదా శ్రీ : ప్రకృతి మారదు. దాని సహజ లక్షణాలు దాని కుంటాయి. అది అలాగే వుంటుంది. ప్రతి ఒక్కరి ప్రకృతిని నేను తెలుసుకోగలను. అర్ధం చేసుకోగలను. నేను ప్రకృతిని వెంటనే గుర్తిస్తాను. కనుక ప్రజలతో వారి ప్రకృతిననుసరించి వ్యవహరిస్తాను. మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం సూర్యునితో కలిసి ఆనందించాలని వెళ్తే నీవు బాధపడతావు. చలికాలం సూర్యుడు అంత తీవ్రముగా ఉండడు. నీవొక్కసారి సూర్యుని ప్రకృతిని తెలుసుకుంటే నీ పనులకై నీవు సర్దుబాటు చేసికోవచ్చు. నేను ప్రకృతిని అర్ధం చేసికొంటాను, మీరు నాతో ఘర్షణకై ప్రయత్నించినా నేను దానినుండి వైదొలగుతాను. నేను దానికి అవకాశమివ్వను. లేకుంటే జగడంలో యిద్దరూ బాధపడతారు. అందువల్ల ఇంట్లో ప్రతి ఒక్కరి ప్రకృతిని గుర్తించు. ఈ కలియుగంలో ప్రకృతులు పంటపొలంలా ఒకేలా వుండవు, అవి ఉద్యానవనంలా విభిన్నంగా ఉంటాయి. ఒకటి లిల్లి, ఇంకొకటి గులాబీ, మరొకటి మల్లె. ఆ పుష్పాలన్నీ జగడమాడుకుంటున్నందువల్ల అక్కడ వివాదాలు శాశ్వతంగా ఉంటాయి.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38