SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 24 జరిగింది న్యాజీవం బుద్ధి ఉంటుంది కదా? డెవలప్ట్ బుద్ధి దు:ఖానికి కారణం అవుతుంది. లేకుంటే దు: ఖమే లేదు. నా విషయంలో బుద్ధి డెవలప్ అయిన తర్వాతనే వెళ్ళిపోయింది. బుద్ది పూర్తిగా నిర్మూలనమైంది. దాని ఛాయ కూడ మిగలలేదు. “అది ఎలా వెళ్ళిపోయింది. దానిని వెళ్ళిపొమ్మని పదే పదే చెప్పటం వలన వెళ్ళిపోయిందా?” అని ఒకరు నన్ను అడిగారు. ఆ పని చేయకూడదు. మనకు జీవితంలో ఇంతవరకు అది చాలా మేలు చేసింది. క్లిష్ట సమస్యలలో నిర్ణయాలు తీసికోవలసి వచ్చినపుడు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అని మార్గదర్శనం చేసిందిబుద్ధి. ఎలా బయటకు పొమ్మని చెప్తాం? ఎవరైతే న్యాయం కోసం వెదుకుతుంటారో వారిలో బుద్ధి ఎప్పటికీ వుంటుంది. ఏమి జరిగినా సరే జరిగిందే న్యాయం అని ఎవరు అంగీకరిస్తారో వారు బుద్ధి ప్రభావం నుంచి బయటపడతారు. ప్రశ్నకర్త : కానీ దాదా, జీవితంలో ఏమి జరిగినా సరే స్వీకరించాలా ? దాదాశ్రీ : బాధ అనుభవించిన తర్వాత స్వీకరించటం కంటే ముందే ఆనందంగా స్వీకరించటం మంచిది. ప్రశ్నకర్త : సంసారంలో పిల్లలు, కోడళ్ళు ఇంకా ఎన్నో బాంధవ్యాలు, వీళ్ళందరితో సత్సంబంధాలు కల్గి ఉండాలి. దాదాశ్రీ : అవును. అన్ని బాంధవ్యాలు నిలుపుకోవాలి. ప్రశ్నకర్త : అవును. కానీ ఆ బాంధవ్యాల కారణంగానే మాకు దుఃఖం కల్గితే? దాదాశ్రీ : సత్సంబంధాలు కల్గి ఉండి కూడా, వారి కారణంగానే బాధ కల్గితే ఆ కష్టాలను అంగీకరించాలి. లేకుంటే మనం చేయకల్గింది ఏముంది? వేరే పరిష్కారం ఏమైనా ఉందా? ప్రశ్నకర్త : లాయరును ఆశ్రయించటం తప్ప వేరే దారి లేదు. దాదాశ్రీ : అవును. ఎవరైనా ఏమి చేయగలరు? లాయర్లు రక్షిస్తారా లేక వారి ఫీజు వసూలు చేసికొంటారా? ప్రకృతి న్యాయాన్ని అంగీకరిస్తే బుద్ధి వలాయనం చిత్తగిస్తుంది. న్యాయంకోసం వెదికే సందర్భం ఎదురైన వెంటనే బుద్ధి లేచి
SR No.030151
Book TitleWhatever Happens Justice
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages37
LanguageOther
ClassificationBook_Other
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy