SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ బాధపడేవానిదే తప్పు 16 మంచి సంస్కృతి విలువలు ప్రశ్నకర్త : ఒక వ్యక్తి తన స్వంత తప్పుల కారణంగా బాధపడ్తుంటాడు. ప్రజలు అతనిపై దయచూపి, ప్రశ్నలవర్షం కురిపిస్తారు. నిజానికి వారు అనావశ్యకంగా జోక్యం చేసుకొంటున్నారు. ఎందువల్లనంటే వారు అతని బాధను తొలగించలేరు. స్వకర్మ ఫలాన్ని అతడు అనుభవిస్తున్నాడు. దాదాశ్రీ : మన మంచి సంప్రదాయ విలువల కారణంగా ప్రజలు దయ చూపటం, పరామర్శించటం చేస్తారు. వ్యాధిగ్రస్తుణ్ణి అతని ఆరోగ్యం గురించి ప్రశ్నించటం ద్వారా వారతనికి ఓదార్పునిస్తారు. వారి దయ అతనికి ఊరటనిస్తుంది. అది ఎంతో విలువైనది, అతని బాధను మరిపింపజేస్తుంది. గుణించటం లేదా భాగించటం కలపటం మరియు తీసివేయటం ఇవి రెండూ సహజమైన సర్దుబాట్లు. ప్రజలు తమ బుద్ధిని ఉపయోగించి సదా గుణించడం, భాగించటం చేస్తుంటారు. వారు తమ సంపదని వృద్ధి చేయటంలో నిమగ్నమై ఉంటారు. తమ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలా మరియు సంపదను ఎలా వృద్ధి చేయాలా అని చింతిస్తూనే వారు నిద్రిస్తారు. అలా చేయటం ద్వారా వారు సుఖాలను గుణిస్తున్నారు, దుఃఖాలను భాగిస్తున్నారు. సుఖాలను గుణించుకోవటం ద్వారా భయంకర దుఃఖప్రాప్తి కల్గుతుంది. దు:ఖాలను భాగించినప్పటికీ అతని బాధలు తగ్గవు. కలపటం మరియు తీసివేయటం అనేవి ప్రకృతి యొక్క సర్దుబాట్లు. ఒకరు డబ్బుపోగొట్టుకొన్నపుడు, వ్యాపారంలో నష్టం వచ్చినపుడు లేదా ధనం దొంగలించబడినపుడు, యివి అన్నీ ప్రకృతి యొక్క సర్దుబాట్లు, దోషం బాధపడేవానిది. దీనిని నేను జ్ఞానదృష్టితో దర్శించి పూర్ణ నిశ్చయంతో చెప్తున్నాను. ప్రశ్నకర్త : సుఖాన్ని గుణించుకోవటం వల్ల తప్పేమిటి ? దాదాశ్రీ : నీవు దేనినైనా గుణించదల్చుకొంటే నీ బాధలను గుణించుకో. సుఖాన్ని
SR No.030113
Book TitleFault Is Of Sufferer
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages38
LanguageOther
ClassificationBook_Other
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy