SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ఘాతిణలకు దూరంగా ఉండండి కూడ ప్రపంచ విషయాలలో చిక్కుపడటం వివేకం కాదు. ప్రపంచంలోని ఘర్షణలలో చిక్కుకొన్న ప్రతిసారీ మన స్వరూపాన్ని మరచిపోతాం. అనుకోని విధంగా ఏదైనా వివాదంలో చిక్కుకుంటే ఆ పరిస్థితినుంచి ఎటువంటి ఘర్షణకూ లోను కాకుండా బయటపడగలగాలి. సున్నితంగా సమాధాన పరచాలి. ట్రాఫిక్ నిబంధనల వల్ల యాక్సిడెంట్ నుంచి రక్షణ రహదారిలో మనం నడుస్తున్నపుడు, రద్దీగా ఉన్న రోడ్డును దాటుతున్నపుడు యాక్సిడెంట్ జరగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాం. నిత్య జీవితంలో కూడ ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఎటువంటి ఘర్షణ జరగకుండా అంతే జాగ్రత్తను పాటించాలి. అవతలి వ్యక్తి ఎంతటి క్రూరుడైనా, అతని ప్రవర్తన ఎంత ఏహ్యమైనది అయినప్పటికి అతనిని గాయపరచటం నీ లక్ష్యం కాకూడదు. మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ అవతలి వ్యక్తి మీతో వివాదానికి తలపడి మిమ్మల్ని గాయపరచవచ్చు. ప్రతి వివాదంలోనూ యిరుపక్షాల వారికీ నష్టం కల్గుతుంది. మీరు ఎదుటివ్యక్తికి దు:ఖాన్ని కల్గిస్తే ఆ సమయంలో మీకూ దు:ఖం కల్గక మానదు. ఎదురుగా తలపడటం అంటే ఫలం అదే. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన ఉదాహరణ చెప్తాను. మీరు ఎదురుగా వస్తున్న ఏదైనా వాహనాన్ని ఢీకొత్తే, ఆ యాక్సిడెంట్ కి ఫలం మరణమే. అందువల్ల ఎవరితోనూ ఘర్షణకు దిగవద్దు. అదే విధంగా నిత్య జీవితంలో లౌకిక వ్యవహారంలో ఎటువంటి వివాదాలకూ తావు యివ్వకూడదు. వ్యవహారిక కార్యాలలో ఎటువంటి ఘర్షణకు దిగకూడదు. ఘర్షణలో ఎప్పుడూ రిస్క్ వుంటుంది. ఘర్షణ అప్పుడప్పుడు ఉంటుంది. నెలలో రెండు వందల సార్లు వివాదాలు, విభేదాలు తలెత్తుతాయా? నెలలో ఎన్నిసార్లు యిటువంటి పరిస్థితి నీకు ఎదురౌతుంది? ప్రశ్నకర్త : ఎప్పుడో ఒకసారి! రెండునుంచి నాల్గుసార్లు. దాదాశ్రీ : వీటిని అధిగమించాలి. వివాదాల కారణంగా జీవితాన్ని ఎందుకు దుర్భరం చేసికోవాలి? అది మనకు తగదు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను, నియంత్రణలను చక్కగా గౌరవిస్తారు. వారి యిష్ట ప్రకారం వారు
SR No.030104
Book TitleAvoid Clashes
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages37
LanguageOther
ClassificationBook_Other
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy