SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 19 సర్వత్ర సర్దుకొనిపొండి దాదా శ్రీ : ఏ ప్రయత్నమూ అవసరం లేదు, నీవు నా ఆజ్ఞను పాటిస్తే చాలు “దాదా మనకి ప్రతిచోటా ఎడ్జస్ట్ అవ్వాలని చెప్పారు” అని గుర్తుంచుకుంటే చాలు. సర్దుబాటు అదే వస్తుంది. నీ భార్య నిన్ను 'దొంగ' అంటే, అపుడు నీవామెతో ఆమె చెప్పింది యదార్ధమేనని చెప్పాలి. ఒకవేళ ఆమె ఒక చీర కొనుక్కోవాలనుకుంటే ఆమె కోరినదానికంటే కొంచెం ఎక్కువ డబ్బు యివ్వు. బ్రహ్మకి ఒకరోజు మన జీవితకాలానికి సమానం. బ్రహ్మకాలమానంతో పోలిస్తే మన జీవితకాలం ఒక్క రోజు. ఒక్కరోజు జీవితంకోసం ఈ కలహాలు అన్నీ దేనికి? బ్రహ్మకాలమానం ప్రకారం ఒక వంద సంవత్సరాలు మీరు జీవించవలసివుంటే “మేమెందుకు ఎడ్జస్ట్ కావాలి” అని తర్కించటం సముచితంగా ఉంటుంది, అపుడు మీరు మీవాదనలు ప్రారంభించవచ్చు. ఏమైనప్పటికీ, మీరు దీనిని త్వరగా ముగించగోరినచో ఏమి చేస్తారు? ఎడ్జస్ట్ అవుతారా లేక తిరిగి పోట్లాడతారా ? జీవితం చాలా చిన్నది. ప్రతి చోట ఎడ్జస్ట్ అవ్వటం ద్వారా మీ పనిని త్వరగా పూర్తిచేసుకోవలసి వుంది. మీ భార్యతో పోట్లాడినపుడు రాత్రి మీరు నిద్రపోగలరా? అదీ కాక, తెల్లవారిన తర్వాత మంచి ఉపాహారం మీకు లభిస్తుందా? జ్ఞానియొక్క కౌశలాన్ని ఆచరించండి. ఒకరాత్రి భార్య తనకి క్రొత్త చీర కొనమని భర్తతో వాదిస్తుంది. అతడు ఆ చీర ఖరీదెంత అని అడుగగా ఆమె దానిమూల్యం 2200 రూపాయలు మాత్రమే అని చెప్తుంది. ఆ చీర 200 లేక 300 రు||లు అయినచో తాను సంతోషంగా ఆమెకి కొని యిచ్చేవాడినని, అంత ఖరీదైన చీరను కొనే శక్తి తనకి ఎక్కడిదని భర్త చెప్పాడు. దానితో భార్య గొడవపడి మూతి ముడుచుకుంటుంది. ఎటువంటి సమస్య సృష్టింపబడింది? వివాహం చేసికోవటమే తప్పయిందని అతడు బాధపడటం మొదలు పెడ్తాడు. జరిగిపోయినదానికి బాధపడి ప్రయోజనం ఏమిటి? ఇదే దు:ఖం. ప్రశ్నకర్త : భర్త ఆమెకు 2200 రూపాయల చీర కొని పెట్టాలని మీరు చెప్తున్నారా? దాదాశ్రీ : దానిని కొనటం, కొనకపోవటం అతనిపై ఆధారపడి వుంది. ఆమె
SR No.030003
Book TitleAdjust Every Where
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages38
LanguageOther
ClassificationBook_Other
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy